తాగుబోతు డ్రైవర్లకు తగిన శిక్ష... విశాఖ బీచ్ లో చెత్త ఏరించిన కోర్టు

Feb 22, 2023, 3:09 PM IST

విశాఖపట్నం : తమ ప్రాణాలనే కాదు ఎదుటివారి ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి తాగిన మైకంలో వాహనాలు నడిపేవారి తిక్కు కుదిర్చింది విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు. ప్రాణాలను లెక్కచేయకుండా  డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారితో పర్యావరణాన్ని కాపాడే పనులు చేయించాలంటూ శిక్ష విధించారు న్యాయమూర్తి. ఇలా మూడురోజుల్లో పట్టుబడ్డ 52 మందితో తాగుబోతులతో విశాఖ సముద్రతీరంలో వ్యర్థాలను ఏరివేయించి శుభ్రం చేయించారు పోలీసులు.