
జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, బలవంతపు గర్భస్రావాల గురించి బాధితురాలు తొలిసారి మౌనం వీడింది. రాజకీయ ప్రభావంతో తనను నోరు మూయించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.