Dec 13, 2019, 1:30 PM IST
ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నరేగా పథకానికి టీడీపీ హయాంలో మంచి గుర్తింపు వచ్చిందని, ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లింపు అంశంపై సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతామని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజూ ఏదో ఒక సమస్యపై టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.