Mar 16, 2022, 10:49 AM IST
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తూ టిడిపి ఆందోళన కొనసాగిస్తోంది. గత రెండు రోజులుగా అసెంబ్లీలోనూ, బయటా టిడిపి నిరసనకు దిగింది. ఇవాళ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ టిడిపి నాయకులు ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం వరుస మరణాలు కల్తీ సారా తాగడమే కారణమని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.