నారాలోకేష్ అరెస్టు : పోలీస్ స్టేషన్ ముందు పంచుమర్తి అనురాధ ధర్నా

Jan 7, 2020, 4:41 PM IST

రహదారుల దిగ్భందంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలని బెంజ్ సర్కిల్ సమీపంలో పోలీసులు అరెస్ట్  చేసి తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ను తరలించారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.