నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్టు

Dec 12, 2020, 1:16 PM IST

చిత్తూరు జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కారు అద్దాలు పగలగొట్టడం పిరికి పందల చర్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు గృహ దిగ్బంధం చేసినంత మాత్రాన తనను తంభళ్లపల్లి నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా ఆపలేరని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు, తంభళ్లపల్లి నియోజకవర్గం ప్రజలు వైసిపి అరాచక ప్రభుత్వం గురించి తెలుసుకోవాలని అన్నారు..కరోన కారణంగా ఎటువంటి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్ళరాదని నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.