Dec 3, 2021, 2:57 PM IST
టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (devineni uma maheswara rao) తండ్రి శ్రీమన్నారాయణ (srimannarayana)గత రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీమన్నారాయణ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నివాళులు అర్పించారు. శ్రీ మన్నారాయణ టీడీపీకి ఎనలేని కృషి చేశారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా.. పిల్లలని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దేవినేని ఉమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. శ్రీ మన్నారాయణ ఆత్మకి శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం. అయితే ఆయన కుటుంబంతో సహా కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దరు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ (devineni venkata ramana) , దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో పాల్గొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఇక, ఇవాళ కంచికచర్లలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన మరణవార్త విన్న దేవినేని అవినాష్.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మి, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ. దేవినేని చెందు, వినయ్ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు ఇక, కంచికచర్లలో పలువురు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.