Galam Venkata Rao | Published: Mar 31, 2025, 3:00 PM IST
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరై పసుపు జెండా ఎగురవేశారు. కేక్ కట్ చేసి కార్యకర్తకు తినిపించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి హోమ్ మంత్రి వంగలపూడి అనిత ప్రసంగించారు.