Nov 30, 2019, 3:13 PM IST
పాడేరు డివిజన్ పరిధిలో వచ్చే నెల 2 నుంచి 8 తేదీ వరకు "సిపిఐ"మావోయిస్టు నిర్వహించే పిఎల్ జిఏ వారోత్సవాల సందర్భంగా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.మారుమూల గ్రామాలకు రాజకీయ నాయకులు వెళ్లవద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.