Video : కారులో గుట్కా ప్యాకెట్లు...అరెస్టు చేసిన పోలీసులు...

Jan 9, 2020, 8:12 AM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో కారులో అక్రమంగా నిషేధిత గుట్కాను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను, కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన పల్నాటి దుర్గారావు హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో గుట్కాను తీసుకువస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు పరిటాల శివారు వద్ద అడ్డుకున్నారు. తనిఖీల అనంతరం, కారును సీజ్ చేసి దుర్గారావుతో పాటు కారులో ఉన్న విజయవాడకు చెందిన ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. Police arrest three for transporting gutkha, At Kanchikacherla, 2 lakhs worth 
Gutkha products seized, Krishna District, Paritala, Hyderabad, Vijayawada