మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ రూ. 60 లక్షలు సొంత నిధులతో మైసూరవారిపల్లికి ఆట స్థలం కొనుగోలు

Oct 11, 2024, 10:36 PM IST

బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహ దారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. ఇది గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఆట స్థలం సాకారానికి చొరవ చూపించారు.