Dec 2, 2019, 12:06 PM IST
ఉల్లి ధరలు పెంపుపై నిరసన తెలీయజేసిన తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి పరిటాల సునీత తప్పు పట్టారు. నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అంటూ జగన్ సర్కార్ ను నిలదీశారు. జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నారాయణస్వామిని టిడిపి జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి ఆమె పరామర్శించారు.