May 17, 2022, 7:24 PM IST
నగరి: ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజాకు సొంత నియోజకవర్గంలో వింత అనుభవం ఎదురయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసిపి ప్రజాప్రతినిధులంతా గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి రోజా కూడా చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం నగరిలో పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో మాట్లాడారు. ఫించన్ వస్తుందా? లేదా? అని అతడిని అడగ్గా... తనకు నెలనెలా ఫించన్ వస్తుందని తెలిపాడు. అయితే తాను ఒంటరిగా ఉన్నందున పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు...పెళ్లికూతురుని చూడాలని రోజాను కోరాడు. ఆయన విన్నపం విన్న రోజా నవ్వుతూ 'ఫించను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం' అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.