Dec 21, 2021, 10:22 AM IST
ప్రకాశం: సొంత వైసిపి పార్టీకి చెందిన నాయకుడిపైనే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తీరువల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటూ ఇటీవల బాలినేని పుట్టునరోజున జరిగిన ఓ కార్యక్రమంలో వైసిపి నేత సుబ్బారావు గుప్త సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ నేపథ్యంలోనే అతడి ఇంటిపై శనివారం కొందరు దాడికి పాల్పడగా ప్రాణభయంతో సుబ్బారావు ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. ఆదివారం అతడి ఆఛూకీ కనుక్కున్న మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ గ్యాంగ్ తో వెళ్లి దాడికి పాల్పడ్డాడు. సుబ్బారావును సుభానీ బూతులు తిడుతూ దాడిచేయడమే కాదు దీన్నంతా వీడియో తీయించుకున్నాడు. ఈ వీడియో బయటకు లీక్ అయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది