May 27, 2023, 3:37 PM IST
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రంలో అధ్వానమైన దుస్థితి నెలకొంది. డ్రైనేజీకి సంబంధించిన కుండీల నుంచి మురికి నీరు పొంగిపొర్లి రోడ్లపై ప్రవహిస్తుంది. గత కొంతకాలం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపార కేంద్రం రోడ్లన్నీ మురికినీటితోపాటు దుర్వాసన వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని అంటున్నారు. దీంతో విసిగి పోయిన వ్యాపారులు ముక్కులు మూసుకుని మురికి రోడ్లపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం మద్దతుగా నిలిచారు.