ఇంటి స్థలాల లిస్టులో పేరు లేదని.. సెల్ టవర్ ఎక్కి హల్ చల్...

Jul 14, 2020, 2:07 PM IST

గుంటూరు జిల్లా, గురజాలలో ఇంటి స్థలం ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. గురజాల పట్టణానికి చెందిన ఉప్పు తల నాగేశ్వరావు అనే వ్యక్తి ఇంటి స్థలాలు సాంక్షన్ అయిన లిస్టులో తన పేరు లేకపోవడంతో మన స్థాపన గురై బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై బాలకృష్ణ, ఎమ్ ఆర్ ఓ అతనికి  న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో కిందికి దిగి వచ్చాడు.