Nov 29, 2019, 3:19 PM IST
అమరావతి సచివాలయంలో దివ్యాంగులు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలగా 4,5వ బ్లాక్ ల్లోని లిప్టులు పని చేయడం లేదు. దీంతో మెట్లు ఎక్కలేక, దిగలేక దివ్యాంగులు,వృద్ధులు కష్టాలు పడుతున్నారు. సీఆర్డీఏ కి జాన్సన్ కంపెనీకి మధ్య లిఫ్టులు ఒప్పందం ఉంది. అయితే ఇప్పటికి పెండింగ్ బిల్లు క్లియర్ కాకపోవడం జాన్సన్ కంపెనీ నిర్వహణ వదిలేసింది. జాన్సన్ లిఫ్టులు మెయింటినెన్స్ చూస్తున్న స్టెలింగ్ అండ్ విల్సన్ సంస్థ తాము కేవలం లిఫ్టులు మ్యాన్ పవర్ మాత్రమే చూస్తామని చెబుతున్నారు.