మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఒక వెరైటీ ట్రీట్. మహేష్ బాబు నటన, పూరి దర్శకత్వం కలయిక సెన్సేషనల్ విజయం సాధించాయి . డైలాగులు, ఫైట్స్, రొమాన్స్ అన్నీ పర్‌ఫెక్ట్ మిక్స్! గా అదరకొట్టాయి. మహేష్ బాబు అభిమానులకు పోకిరి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం.
ఈ సినిమా వారి గుండెల్లో ఒక శాశ్వత స్థానం పొందింది. ఈ చిత్రం 2006లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదల తర్వాత మహేష్ బాబు మాస్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగింది. అయితే ఈ సినిమా తెర వెనక విశేషాలు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ వేరే. ఆ టైటిల్ ఏమిటి...ఎందుకు వద్దనుకున్నారో చూద్దాం.
పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మహేష్, పూరిల సినీ కెరీర్‌కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇన్నేళ్ల తర్వాత చూసినా చాలా ప్రెష్ గా కొత్త సినిమాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని మహేష్ కోసం రాసుకోలేదు పూరి జగన్నాథ్. మరి ఎవరి కోసం అనుకున్నారు
దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని మహేష్‌బాబుతో కలిసి 2006లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోలుగా పవన్‌కల్యాణ్, రవితేజలను కూడా అనుకున్నారు. అయితే అవేమీ మెటీరిలైజ్ కాలేదు. రవితేజతో ఈ సినిమా పట్టాలు ఎక్కేయాల్సింది. నిర్మాత మరెవరో కాదు నాగబాబు.
అయితే రవితేజకు ఓ ఆఫరొ చ్చింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ట యిన చేరన్ సినిమా 'ఆటోగ్రాఫ్' తెలుగు రీమేక్ లో చేసే ఛాన్సు... వదులుకోకూ డదు... వదిలితే ఎవరో ఒకరు చేసేస్తారు అనే భయంతో వెంటనే కమిటైపోయాడు. రవితేజ హార్ట్ ని టచ్ చేసిన సినిమా అది.
దాంతో 'ఆటోగ్రాఫ్' ప్రాజెక్టుకి ఆటో గ్రాఫ్ ఇచ్చేశాడు రవితేజ. దాంతో 'పోకిరి'కి తాత్కాలిక బ్రేక్. ఆ తర్వాత పూరి కు సోనూసూద్ కనబడ్డాడు. బాలీవుడ్ యాక్టర్. ఒడ్డూ పొడుగు... బావుంటాడు... పూరీకి అతనితో ఎక్స్ పెరిమెంట్ చేద్దామనిపించింది. అయితే భాక్సాఫీస్ లెక్కలు కుదర్లేదు. అదీ ఆగిపోయింది. అప్పుడు సీన్ లోకి వచ్చాడు మహేష్ బాబు.
Mahesh Babu
ఇక ఈ సినిమాకు అప్పటిదాకా అనుకున్న టైటిల్ ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ’. ఇలాంటి వెరైటీ టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు.
మొదట అనుకున్న కథలో హీరో సిక్కుల కుర్రాడు. పేరు ఉత్తమ్ సింగ్. మాఫియా ముఠాలో చేరతాడు. వాళ్ల మధ్యనే ఉంటూ వాళ్లనే ఖతమ్ చేస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే - ఉత్త మ్ సింగ్ ఓ పోలీసాఫీసరు. మహేశ్ కు తెగ నచ్చేసింది.
Mahesh Babu
"నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టేద్దాం... కానీ చిన్న ఛేంజ్. సిక్కు బ్యాక్ డ్రాప్ మార్చేయండి. మిగతాదంతా ఓకే” అని చెప్పాడు మహేశ్. మార్పుకి పూరీ ఓకే. అలాగే మహేష్ కు 'ఉత్తమ్సింగ్' టైటిల్ నచ్చ లేదు. పూరి వెంటనే 'పోకిరి' టైటిల్ చెప్పే శాడు. మహేశ్ కు ఆ టైటిల్ నచ్చేసింది. అలా పోకిరి సినిమా పట్టాలు ఎక్కింది. రికార్డు లు క్రేయేట్ చేసింది.
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’కూ ఆడిషన్స్ జరిగాయట.
దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్ ఇచ్చింది. గనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది.