చుండ్రు సమస్యకు చెక్…
లవంగాల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. లవంగం నీరు చుండ్రు చికిత్సలో బాగా హెల్ప్ అవుతుంది.
కుదుళ్లు బలంగా…
లవంగం నీటిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే బాక్టీరియా, శిలీంధ్రాల నుండి రక్షిస్తూ, జుట్టును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లను నివారించడం ద్వారా, లవంగం నీరు హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా జుట్టు రాలడం అనే సమస్య ఉండదు.