ఇకపై అలాచేస్తే కఠిన చర్యలు... హిజ్రాలకు కడప డిఎస్పీ వార్నింగ్

Mar 30, 2021, 10:08 AM IST

కడప: టోల్ గేట్ల వద్ద,  రహదారి ప్రధాన కూడళ్ళలో  వాహనాలు ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం మంచిపద్దతి కాదని హిజ్రాలకు కడప డిఎస్పీ సునీల్ సూచించారు. ఇలా దారిన వచ్చి, పోయే వాహనదారులకు ఇబ్బందులు కలుగచేస్తూ తీవ్రస్థాయిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడమే కాదు రోడ్డు  ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారన్నారు. కాబట్టి ఇక మీదట రోడ్ల వెంట్ల, ట్రాఫిక్ కూడళ్ళలో మరియు టోల్ గేట్ల వద్ద  వాహనములు ఆపి డబ్బులు వసూలు చేయరాదు అని డిఎస్పీ హెచ్చరించారు. ఇక మీదట అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని డిఎస్పీ  హెచ్చరించారు. కడప నగరము నందు నివాసం ఉంటున్న హిజ్రాలకు  తాలూకా పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఇన్స్పెక్టర్ నాగభూషణం, ఎస్.ఐ  హుస్సేన్, పిఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు అలంఖాన్ పల్లి మహిళా సంరక్షక కార్యదర్శులు  పాల్గొన్నారు.