
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రసారం చేసిన కథనం జర్నలిజం కంటే ఒక ఫ్లాప్ సినిమా స్క్రిప్ట్లా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోరెన్సిక్ ఆధారాలు లేకుండా, టైమ్ స్టాంపులు లేని వాట్సాప్ చాట్స్, బ్లర్ చేసిన వీడియోలు చూపిస్తూ ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా బాధితురాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు ఎందుకు లేదు? కోర్టు మెట్లు ఎక్కడ? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి.