జగన్ కి పూర్తిగా పిచ్చెక్కింది: అచ్చెన్నాయుడు | Atchennaidu Slams YS Jagan | Asianet News Telugu

Published : Feb 20, 2025, 06:01 PM IST

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటివరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ, ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగాలేకపోవడం వల్ల మళ్లీ ఆదేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పటి వరకూ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకత ను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu
28:42YS Jagan Comments on Pawan: అసెంబ్లీ లో పవన్ కామెంట్స్ జగన్ ఊహించని కౌంటర్ | Asianet News Telugu