Jan 13, 2022, 3:01 PM IST
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం నుండి విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లు, బంధుమిత్రులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో అకాల వర్షం వారి ఆశలపై నీరు చల్లుతోంది.