అద్దంకి ప్రజల చిరకాల కోరికైన రెవిన్యూ డివిజన్ తో పాటు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అద్దంకి ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తాను చేసిన అభ్యర్థన, ప్రజల కోరిక మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపారని మంత్రి గొట్టిపాటి తెలిపారు.