మా ఆశలు సమాధి చేశారంటూ.. అమరావతి రైతుల మహా పాదయాత్ర..

22, Oct 2020, 4:04 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి  శంఖుస్థాపన జరిగిన నేటికి ఐదేళ్లు. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు, మహిళలు, ఐకాస నేతలు, రాజకీయ పక్షాల ప్రతినిధులు పాదయాత్రగా శంఖుస్థాపన ప్రాంతానికి కదిలారు. రాయపూడి నుంచి ఉద్దండరాయని పాలెం వరకు అమరావతి రైతుల ర్యాలీని  జేఏసీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు.  310రోజులుగా అమరావతి కోసం ఉద్యమం సాగుతుంది. మందడం సీడ్ యాక్సిస్ రోడ్డువద్ద మూడు రాజధానుల కు మద్దతుగా దళిత బహుజన పరిరక్షణ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.