పెట్రోల్ ట్యాంకర్ లో మంటలు..తృటిలో తప్పిన ప్రమాదం...

Feb 13, 2020, 1:53 PM IST

విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ పెట్రోల్ ట్యాంకర్ క్యాబిన్ లో మంటలు అంటుకున్నాయి. మంటలు చూసిన డ్రైవర్ ట్యాంకర్ వదిలేసి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ అంటుకున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.