‘ప్రతినిధి 2’ ఫోస్ట్ ఫోన్ వెనక రాజకీయం? భయపెట్టే కంటెంట్? , స్టోరీ లైన్ ఇదే

First Published Apr 24, 2024, 7:32 AM IST

ప్రతినిధి 2 వాయిదా పడటం  సిని,రాజకీయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్న  టైమ్ లో  ఈ మూవీకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్న  టైమ్ లో  ఇలా పోస్ట్ పోన్ కావడం ఊహించని పరిణామం. 


నారా రోహిత్  ఈ మధ్యకాలంలో  చాలా గ్యాప్ తీసుకుని మరీ  చేసిన సినిమా ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో ఇంక నారా రోహిత్ సినిమాలు చేయడు,మానేసాడు అప్పట్లో టాక్ వైరలైంది. మళ్లీ ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా పడింది. 


'ప్రతినిధి 2' విడుదల వాయిదా వేశామని, కొత్త విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేస్తామని చిత్ర  టీమ్ పేర్కొంది.  'ప్రతినిధి 2' వాయిదాకి గల కారణాలు టీమ్ వెల్లడించలేదు. అందుకు కారణం సెన్సార్ ఆఫీసర్ లీవ్ లో ఉండటం వలన సెన్సార్ కాలేదని అందుకే వాయిదా పడిందని వినికిడి. మరో ప్రక్క వాయిదా పడటం వెనుక రాజకీయం ఉందని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. 
 

Prathinidhi 2


నారా రోహిత్  కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  స్వయానా పెదనాన్న. అందుకని, ఈ సినిమా ఖచ్చితంగా తెలుగుదేశం  పార్టీకి అనుకూలంగా సినిమా తీసి వుంటారని ప్రత్యర్థి పార్టీ నాయకులు, వాళ్ల అనుచరులు సినిమా సెన్సార్ అవకుండా  తెర వెనుక చక్రం తిప్పారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.   విడుదల వాయిదా వెనక అసలు నిజం ఏమిటనేది తెలియాల్సి ఉంది. 
 


ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.  ట్రైలర్ లో జాతిపిత మహాత్మా గాంధీ మరణించినప్పుడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని వేసిన ప్రశ్న ప్రత్యర్ది పార్టీ అధినేత తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలకు సూటిగా తగిలిన ప్రశ్నగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఏపీలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడిందని చెప్తున్నారు. కొన్ని రోజులపాటు విడుదల వాయిదా వేశామని.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది టీం.


సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే సమస్య పరిష్కారం దిశగా పక్కా పొలిటికల్‌ జోనర్‌లో రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.  ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పొలిటీషన్ తన పవర్ తో  ..ఓ మీడియా జర్నలిస్ట్ ని టార్గెట్ చేస్తే అతను అన్ని దాటుకుని తనేంటో చూపటమే ఈ సినిమా కథాంశం అంటున్నారు. దర్శకుడు మూర్తి తన నిజ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లలను,వేధింపులను ఈ సినిమాలో చూపాడంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఓ వర్గాన్ని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.  ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

Prathinidhi 2

ఎన్నికలు 13వ తేదీ జరుగుతాయి.  ఈలోగా సెన్సార్ నుంచి కంటెంట్ పరంగా ఏమైనా అబ్జెక్షన్ వచ్చినా, మార్పులు చేర్పులు సూచించినా లేక మొత్తానికే రివైజింగ్ కమిటీకి పంపించినా దానికి టైం పడుతుంది. రిలీజ్ కష్టమవుతుంది. 

నారా రోహిత్ మాట్లాడుతూ..‘ప్రతినిధి 2’ విషయానికి వస్తే.. ఇది ఏ పొలిటికల్ లీడర్‌కు సపోర్ట్‌గా ఉండదు. వ్యవస్థని ప్రశ్నించడం నుంచి మొదలుపెట్టి దానిని క్లీన్ చేసే విధానం కూడా ఇందులో చూపెట్టడం జరిగింది. ఇది ప్రాపగాండ మూవీ కాదు. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది హైలీ లోడెడ్ థ్రిల్లర్.. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. నేను గ్యాప్ తీసుకోవడానికి కారణం ఉంది. అప్పట్లో నా సినిమాలు వరసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలే నాకే నచ్చలేదు. సరిగ్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నానని అనిపించింది. అందుకే ఓ రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ఫ్రెష్‌గా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇద్దామనుకునే సమయానికి కరోనా మహమ్మారితో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సరిగ్గా షూటింగ్స్ కూడా నడవలేదు. కరోనా కారణంగా నా గ్యాప్ ఇంకా పెరిగింది. అయితే ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నాను. వాటిలో కొన్ని మంచి కథలను ఓకే చేశాను. అందులో ఒకటి ఈ ‘ప్రతినిధి 2’. ఇకపై వరసగా నా నుండి సినిమాలు వస్తాయి. ఇక గ్యాప్ ఇవ్వను.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను.

నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2' సినిమాలో సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిష్షు సేన్‌ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృథ్వీ రాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రఘు బాబు, రఘు కారుమంచి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, స్టంట్స్: శివ రాజు - పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్ పుప్పాల, సంగీతం: మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - రానా ఆర్ట్స్, నిర్మాతలు: కుమార్‌ రాజా బత్తుల - ఆంజనేయులు శ్రీ తోట - సురేంద్రనాథ్ బొల్లినేని, దర్శకకుడు: మూర్తి దేవగుప్తపు.

click me!