రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం

Jun 11, 2020, 12:31 PM IST

విజయవాడ బందరు రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. అయితే షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం  సంభవించి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. అగ్ని మాపక సిబ్బందిమంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని తెలుస్తుంది.