Nov 29, 2019, 8:22 PM IST
విశాఖపట్నం: తన భూసమస్య పరిష్కారం కోసం ఓ గిరిజన రైతు ప్రాణత్యాగానికి తెగపడ్డాడు. కాళ్లకు చెప్పులరిగేలా మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తన భూ సమస్య తీరకపోవడంతో అదే కార్యాలయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కేవలం తనపైనే కాకుండా కూతురిపై కూడా కిరోసిన్ పోసి బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే అక్కడే వున్నవారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.