Nov 27, 2019, 12:28 PM IST
పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి రోజు పురస్కరించుకుని కృష్ణా తీరం శోభాయమానంగా మారింది. నగరంలోని స్నాన ఘాట్లన్నీ పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల రద్దీతో సందడిగా మారాయి. కార్తీక మాసం చివరి రోజున భక్తులు పసుపు కుంకుమలతో, అరటిడొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదిలి పోలిని స్వర్గానికి పంపించారు.