గడపగడపకు మన ప్రభుత్వం... రోడ్డుపై పట్టుకుని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నిలదీసిన మహిళ

May 30, 2022, 12:28 PM IST

బాపట్ల: గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి నాయకులకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నాయకులకు పరాభవం ఎదురవగా తాజాగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. బాపట్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రఘుపతిని ఓ మహిళ నిలదీసింది. మహిళ ప్రశ్నలను తట్టుకోలేక సముదాయిస్తూనే రఘుపతి ముందుకు జారుకున్నారు.