విశాఖ విమ్స్‌లో కరోనా దయనీయ పరిస్థితి.. కిందపడ్డా పట్టించుకునే దిక్కు లేదు..

Aug 3, 2020, 11:15 AM IST

విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ లో కరోనా పేషంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఓ పేషంట్ షేర్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఓ మహిళ కరోనాతో బాధపడుతూ బెడ్ మీది నుండి కింద పడి కొట్టుకుంటున్నా సిబ్బంది పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. విమ్స్ లో పరిస్థితి అస్సలు బాగాలేదని, రాత్రి ఓ పేషంట్ అరుచుకుంటూ వచ్చి కారిడార్లో పడి చనిపోయాడని చెబుతూ మరో పేషంట్ పానిక్ అయ్యాడు. అయితే దీనిమీద విమ్స్ డైరెక్టర్ స్పందిస్తూ కరోనా పేషంట్ బాత్రూంకు వెళ్తుండగా బెడ్ మీదినుండి కింద పడిపోయిందని, వెంటనే సిబ్బంది స్పందించి ఆమెను తిరిగి బెడ్‌పైకి చేర్చారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఎవరికైనా ఎటువంటి యిబ్బందులు ఉన్నా ముఖ్య మంత్రి కంప్లైంటు సెల్‌ నెం.104 కు గానీ, జిల్లా కంట్రోల్‌ రూం నెం. 0891 2501255/56/57 లకు గాని తెలియ జేయాలని అన్నారు.