Dec 2, 2019, 12:31 PM IST
ఇవాళ గుంటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆరోగ్యశ్రీతో చికిత్సానంతర జీవనోపాధిభృతి అందించు కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ తో డిశ్చార్జి అయిన రోగులకు నెలకు 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 26 విభాగాల్లో 836 రకాల చికిత్సలు చేయించుకుని డిశ్చార్జి అయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది.