Jan 18, 2022, 1:58 PM IST
విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ టిడిపి శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరోనా బారినుండి చంద్రబాబు క్షేమంగా బయటపడాలంటూ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నర్సీపట్నం అయ్యప్పస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు కరోనా నుండి కోలుకోవాలంటూ మణికంట స్వామిని కోరుకున్నారు అయ్యన్న. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.