
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో P4 కార్యక్రమం ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో సమాజ అభివృద్ధి, పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలను అడాప్ట్ చేసుకుని వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.