Jan 25, 2022, 5:54 PM IST
గుడివాడ: సంక్రాంతి పండగ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాసినో ఏర్పాటుచేసారన్న ప్రచారం నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఏపీ బిజెపి ఛలో గుడివాడ చేపట్టింది. అయితే గుడివాడకు వెళ్లకుండా బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసారు. ఈ ఘటనపై తోట్ల వల్లూరు పోలీసు స్టేషన్ వద్ద బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్,విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... పోలీసులు, వైసిపి కార్యకర్తకు పెద్ద తేడాలేదన్నారు. అక్రమ అరెస్టులతో వైసిపి ప్రభుత్వం ఉద్యమాలను అపలేదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నేతలను భేషరతుగా విడుదల చేయాలని... మంత్రివర్గం నుండి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని విష్ణువర్థన్ డిమాండ్ చేసారు.