అంతర్వేది వెళ్లి తిరిగి వస్తుండగా....

Mar 6, 2021, 5:25 PM IST


తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో ఇన్నోవా కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతర్వేది లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని తిరిగి అప్పనపల్లి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్వల్పగాయాలతో భక్తులు బయటపడ్డారు. స్థానికుల సహకారంతో 108 వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు