Badvel Bypoll: బిజెపితో పవన్ కల్యాణ్ విభేదాలు

Badvel Bypoll: బిజెపితో పవన్ కల్యాణ్ విభేదాలు

Published : Oct 08, 2021, 11:03 AM IST

బద్వేలు ఉప ఎన్నిక మరోసారి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు, బిజెపికి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. 

బద్వేలు ఉప ఎన్నిక మరోసారి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు, బిజెపికి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. గతంలో తిరుపతి లోకసభ ఎన్నికల సమయంలోనూ గ్రైటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ బిజెపి వ్యవహరించిన తీరు పట్ల Pawan Kalyan తీవ్ర అసంతృప్తి వ్య.క్తం చేశారు. పొత్తులో భాగంగా Badvel సీటును బిజెపి జనసేనకు కేటాయించింది. అయితే, వైసీపీ అభ్యర్థి దాసరి సుధను ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో తాము పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే, పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకోవడంతో బిజెపి తన అభ్యర్థిని పోటీకి దించుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు సరిగా కుదురుకోవడం లేదనేది మరోసారి తేటతెల్లమైంది.