Jan 31, 2022, 2:04 PM IST
అమరావతి: పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా సచివాలయంలోని మూడో బ్లాక్ ముందు రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఇలా పీఆర్సీ జీవోల రద్దుతో పాటు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.