ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న పోషకాహారం, సౌకర్యాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.