AP PRC Issue: ఎక్కడిక్కడ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు... ఛలో విజయవాడ ఉద్రిక్తత

Feb 3, 2022, 9:53 AM IST

అమరావతి: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమానికి సిద్దమవగా పోలీసులు మాత్రం దీనికి అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడ భారీగా పోలీసులు  మొహరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు.ప్రకాశం బ్యారేజి కనకదుర్గమ్మ వారధి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు విజయవాడకు వెళ్లకుండా ఉద్యోగులకు అడ్డుకుంటున్నారు. భారీ గేట్లు ఏర్పాటు చేసి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా ప్రతిచోటా పోలీసులు వుండటంతో ఉద్యోగులు కూడా విజయవాడకు వెళ్లడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో పోలీసులు అడ్డగిస్తుండటంతో మార్గమధ్యలో చైన్ లాగి రైళ్ళను ఆపి విజయవాడకు పయనమవుతున్నారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు.