Dec 14, 2020, 2:25 PM IST
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఏఎస్సై పార్ధసారధిపై కత్తితో జరిగిన దాడిపై ఏపీ డిజిపి తీవ్రంగా స్పందించారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైకి పూర్తి స్థాయిలో అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనతో సంబంధమున్న వారందరినీ తక్షణం గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.