హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుంది : సోము వీర్రాజు

May 4, 2023, 2:34 PM IST

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందన్నారు. గుంటూరులోని అగ్రహారం పేరును రాత్రికి రాత్రి ఫాతిమా అని బోర్డు పెట్టడం ఏంటని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని సీతమ్మకొండ పేరు మార్పు, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని చూడటం వీటన్నింటి వెనుక వున్న సూత్రధారి ఎవరు అని సోము ప్రశ్నించారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని అంటున్నారని.. హిందువులైన ఎస్సీలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తీరు వుందని వీర్రాజు ఫైర్ అయ్యారు. హిందువులపై దాడులు జరిగేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.