Dec 9, 2021, 2:45 PM IST
విశాఖపట్నం: టాలీవుడ్ స్టార్ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దర్శకుడితో కలిసి బాలకృష్ణ అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి వచ్చిన బాలకృష్ణకు ఆలయ అదికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంబాన్ని ఆలింగనం చేసుకున్నారు . అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవి సన్నిదిలో పూజలు నిర్వవహించి హారతులు అందజేశారు. బేడా మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా ఆలయ అదికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.