అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 3:00 PM IST
Highlights

ప్రేమ వివాహం జరిగిన కొద్ది నెలలకే అమృత వర్షిణి భర్తను కోల్పోయింది. మానవతావాదులు తనకు సపోర్ట్‌గా నిలవాలని కోరుతూ జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌ పేరుతో ఫేస్‌బుక్‌ పేజ్‌ ఓపెన్‌ చేసింది.

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతను కించపరుస్తూ కామెంట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడలో గత నెలలో పెరుమాళ్ల ప్రణయ్‌  అనే యువకుడి హత్య జరిగిన విషయం విధితమే. ప్రేమ వివాహం జరిగిన కొద్ది నెలలకే అమృత వర్షిణి భర్తను కోల్పోయింది. మానవతావాదులు తనకు సపోర్ట్‌గా నిలవాలని కోరుతూ జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌ పేరుతో ఫేస్‌బుక్‌ పేజ్‌ ఓపెన్‌ చేసింది.

 వందలాది మంది ఫాలోవర్స్‌ అమృతకు బాసటగా నిలిచారు. ఇదే సమయంలో అమృత వర్షిణిని అసభ్యకరంగా కామెంట్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో అమృత వర్షిణి వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసి అసభ్యకర కామెంట్స్‌ గురించి వివరించింది.
 
అమృత ఫిర్యాదుపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్‌ విచారణ చేపట్టాలని వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో ఐటీకోర్‌ టీమ్‌ సహకారంతో విచారణ మొదలుపెట్టిన సీఐ సదానాగరాజు అమృ త వర్షిణిని కామెంట్‌ చేసిన యువకుడు రంగారెడ్డి జిల్లా దూలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గొట్టి ఈశ్వర్‌గా గుర్తించి ఐటీ అమెండెమెంట్‌ యాక్ట్‌, 354(డీ)ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, స్వగ్రామంలోని అలెఖ్య రెసిడెన్సీలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో ఇతరులను కామెంట్‌ చేస్తూ అసభ్యకర పదజాలంతో అవమాన పరిచేవిధంగా పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

click me!