
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ నెల 10న కరీంనగర్‌లో జరగనున్న అమిత్ షా సభ ఏర్పాట్లపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన ప్రగతి నివేదన సభకు 20 లక్షల మంది వస్తారని అనుకుంటే.. పట్టుమని నాలుగు లక్షల మంది కూడా రాలేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ విధానాల పట్ల ప్రజలు విసుగుచెందారని అందుకు తగ్గట్టుగానే ఓపినీయన్ పోల్స్‌లో బీజేపీకి బ్రహ్మరథం కట్టారని లక్ష్మణ్ అన్నారు.
ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కేసీఆర్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సమర భేరీకి ప్రజలు భారీగా తరలి రావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.