రైల్వేలో నకిలీ ఎస్ఐ అవతారం:నల్గొండ జిల్లాలో యువతి అరెస్ట్

By narsimha lode  |  First Published Mar 20, 2024, 7:38 AM IST

తప్పుడు ధృవీకరణ పత్రాలతో  రైల్వే శాఖలో పోలీస్ ఉద్యోగం చేస్తున్నట్టుగా నమ్మించిన  యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్   ఫోర్స్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పలువురిని నమ్మిస్తున్న 25 ఏళ్ల యువతిని  తెలంగాణ రైల్వే పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో  ఆమెను అరెస్ట్ చేశారు.నకిలీ రైల్వే ఎస్‌ఐగా వ్యవహరించింది ఎం. మాళవికగా  పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు  వివరాలు వెల్లడించారు.

also read:ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ: గిన్నిస్ రికార్డు స్వంతం చేసుకున్న బెంగుళూరు సంస్థ

Latest Videos

గత ఏడాది కాలంగా  రైల్వే అధికారిగా  మాళవిక నటిస్తుందని పోలీసులు తెలిపారు.  నల్గొండ నుండి సికింద్రాబాద్ వరకు  పానాడు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించి రైల్వే పోలీస్ ఇన్స్ పెక్టర్ గా ఆమె ప్రయాణీకులను నమ్మించినట్టుగా పోలీసులు తెలిపారు.

also read:ఏనుగును బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం: రోడ్డుపై పరుగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సికింద్రాబాద్ లోని ఆర్‌పీఎఫ్ లో  సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నట్టుగా తప్పుడు ధృవీకరణ పత్రాలను  సృష్టించారు.వీటితో  బంధువులను, కుటుంబసభ్యులను, గ్రామస్తులను నమ్మించారని పోలీసులు  తెలిపారు.

also read:నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ: పొలిటికల్ వర్గాల్లో చర్చ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున  నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు ఆమెను అభినందించారు.ప్రముఖ సినీ నటుడు సుమన్ వంటి ప్రముఖులతో  కూడ  నిందితురాలు  పరిచయాలను ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు.

రైల్వే శాఖలో పోలీస్ ఉద్యోగం కోసం నిందితురాలు ప్రయత్నించారు. అయితే ఈ ఉద్యోగం ఆమెకు రాలేదు. కానీ, రైల్వే శాఖలో ఉద్యోగం వచ్చినట్టుగా  కుటుంబ సభ్యులను నమ్మించేందుకు తప్పుడు గుర్తింపు కార్డులను సృష్టించిందని  పోలీసులు తెలిపారు.  నిందితురాలు తన నేరాలను అంగీకరించినట్టుగా పోలీసులు  చెప్పారు.

నిందితురాలి నుండి  సబ్ ఇన్స్ పెక్టర్ యూనిఫారం,  నకిలీ లామినేటేడ్ గుర్తింపు కార్డు, నేమ్ ప్లేట్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.ఐపీసీ  170, 419, 420 సెక్షన్ల కింద నిందితురాలిపై కేసు నమోదు చేసినట్టుగా  పోలీసులు వివరించారు.
 

click me!