Kasani Gnaneshwar Mudiraj: కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వినని వారుండరూ. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనేక పదవుల్లో పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయనకు చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి టికెట్ దక్కింది. ఇంతకీ ఆయన బ్యాక్ రౌండ్ ఏంటీ? ఆయన వ్యక్తిగత, రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
Kasani Gnaneshwar Mudiraj: కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వినని వారుండరూ. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనేక పదవుల్లో పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయనకు చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి టికెట్ దక్కింది. ఇంతకీ ఆయన బ్యాక్ రౌండ్ ఏంటీ? ఆయన వ్యక్తిగత, రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.
బాల్యం
కాసాని జ్ఞానేశ్వర్1954 ఆగస్టు 19న బాచుపల్లి లో జన్మించారు. ఆయన అసలు పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఆయన తల్లిదండ్రులు శ్రీరాములు కౌసల్య. కాసాని జ్ఞానేశ్వర్ ది వ్యవసాయ వ్యాపారం కుటుంబం. 2007 నుండి 2012 వరకు ఆయన తల్లి కౌసల్య.. బాచుపల్లి సర్పంచ్ గా సేవలందించారు.
రాజకీయ జీవితం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. తరచుగా BC సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పరిగణించబడతారు. వాస్తవానికి ఆయన తొలుత 2001 నుండి 2006 వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన తరువాత 2007లో ఆయన పది మంది భారత రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ కోటా నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఇలా 2007 నుండి 2011 వరకు శాసన మండలి సభ్యునిగా పనిచేశారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ)నేత తుళ్ల దేవేందర్‌గౌడ్‌తో విభేదాలు రావడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆగష్టు 2007లో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ’మన పార్టీ’ పేరుతో తన స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీ BC కులాలను ఐక్యత, వారి ప్రగతికోసం పాటు పడుతుందని పేర్కొంది.
ఈ క్రమంలో 2009లోఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి విఫలమయ్యాడు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009 సాధారణ ఎన్నికలలో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలయ్యాడు.
ఇక 2014లో తెలంగాణా శాసనసభ ఎన్నికలలో ప్రజాకూటమి అభ్యర్థి గా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి.. ఆ ఎన్నికలలో కూడా ఆయన ఓడిపోయాడు. ఇక 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీ విడి.. మరోసారి టీడీపి పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ టీటీడీపీ అధ్యక్ష పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
కాసానీ చేపట్టిన పదవులు
2001–2006>> జిల్లా పరిషత్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా
2007–2011>> ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు
1975–1987>> వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ యూత్ కాంగ్రెస్
1987–1993>> ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్
1993లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కోశాధికారి
1999లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెనుకబడిన తరగతులకు ఉప అధ్యక్షులు
2005లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
2007లో మన పార్టీ ఏర్పాటు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు
2022–2023>> తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు
ఇతర పదవులు
కాసాని .. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు .
ఏప్రిల్ 2017లో ఆయన ఆల్ ఇండియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ (AKF) కోశాధికారిగా ఎన్నికయ్యాడు.
2015 నుండి ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.