భర్త ప్రియురాలిని చంపిన భార్య.. గర్భిణి అని కూడా చూడకుండా ఘాతుకం..

By SumaBala Bukka  |  First Published Apr 12, 2023, 2:00 PM IST

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని, గర్భం దాల్చిన యువతిని భార్య పథకం ప్రకారం హత్య చేయించింది. ఈ ఘటన మేడ్చల్ లో వెలుగు చూసింది. 


మేడ్చల్ : హైదరాబాద్ లోని మేడ్చల్ లో ఓదారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం కారణంగా  ఓ యువతి హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాదులోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎసిపి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మృతురాలు ధరిత్రీ సింగ్ (22). ఆమె ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి.  బతుకుతెరువు కోసం ఒరిస్సాలోని కైన్ పులియా గ్రామం నుంచి మేడ్చల్ కు వచ్చింది. 

ఇక్కడ డబిల్ పూర్ చౌరస్తాలోని బనియన్ ట్రీ హోటల్లో కార్మికురాలుగా పనిచేస్తుంది. అదే హోటల్లో షేక్ చాంద్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతను స్థానిక వినాయక నగర్-2లో  ఉంటున్నాడు. అతనితో ధరిత్రీ సింగ్ కు పరిచయం ఏర్పడింది.  అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ కారణంగా దరిద్ర సింగ్ గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ధరిత్రీ సింగ్ షేక్ చాంద్ పై ఒత్తిడి తెచ్చింది. షేక్ చాంద్ కు అప్పటికే పెళ్లి కావడంతో.. దీనికి అతను ఒప్పుకోలేదు.

Latest Videos

undefined

తండ్రి రెండో పెళ్లి.. తట్టుకోలేక సుత్తితో కొట్టి చంపిన కొడుకు...

మరోవైపు ఈ విషయం చాంద్ ఇంట్లో తెలియడంతో  గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ధరిత్రీసింగ్ ను చాంద్  ఆమె సొంత ఊరికి పంపించాడు. గొడవలు కాస్త సద్దుమణిగిన తర్వాత నెలన్నర క్రితం ఆమెను తిరిగి నగరానికి రప్పించాడు. డబిల్ పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో రహస్యంగా ధరిత్రీసింగ్ ను ఉంచాడు. ఆమెతో సంబంధాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ విషయం చాంద్ భార్య పాకీజాకు తెలిసింది. దీంతో ఆమె భర్తను నిలదీసింది.  

కానీ భర్త మాత్రం ధరిత్రి తనను వదలడం లేదంటూ బొంకాడు.  భర్త మాటలను పూర్తిగా నమ్మిన పాకీజా.. ధరిత్రీసింగ్ అడ్డు తొలగించుకోవాలనుకుంది. చాంద్ పనిచేస్తున్న హోటల్లోనే పనిచేస్తున్న అజిమ్ షాకు..అదే కాలనీలో ఉంటున్న మందాకినికి ఈ విషయాన్ని తెలిపింది. ఈ నలుగురు కలిసి ధరిత్రీసింగ్ హత్య చేయాలని  ప్లాన్ వేశారు.

తమ పథకం ప్రకారం..  ఏప్రిల్ 9వ తేదీన  మందాకిని, అజీమ్ షా  బైక్ మీద ధరిత్రి ఇంటికి వెళ్లారు. అజీమ్ షా ధరిత్రీసింగ్ ఇంట్లోకి వెళ్ళాడు. మందాకిని బయటే ఉండి ఎవరైనా వస్తున్నారా.. అని గమనిస్తోంది. అజీమ్ షా ధరిత్రి చేతులు కట్టేశాడు. ఆమె మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. హత్య విషయం వెలుగులోకి రావడంతో మేడ్చల్ పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలిసింది. దీంతో ధరిత్రితో సంబంధం పెట్టుకున్న చాంద్, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి విచారణలో మరో ఇద్దరితో కలిసి ఆమె హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. దీంతో మంగళవారం నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. 

click me!