ఎవరికో కాదు... ముందు రేవంత్ ఫ్యామిలీకి డ్రగ్స్ టెస్ట్..: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిశోర్ డిమాండ్

By Arun Kumar PFirst Published Sep 21, 2021, 3:40 PM IST
Highlights

వైట్ ఛాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్ ను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోమంటున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబమే ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్(TRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్నాయంటూ వైట్ ఛాలెంజ్(White Challenge) విసిరిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy)పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్  విరుచుకుపడ్డారు. రేవంత్ తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడని మండిపడ్డారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే రేపటి నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కిశోర్ హెచ్చరించారు. 

''రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సొంతపార్టీ నాయకులచేతే గాడిద అనిపించుకున్నాడు. కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ నా బొచ్చుగానితో సమానం అని నేను కూడా అనగలుగుతా! రేవంత్ పెద్ద లంగ'' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. 

''రాహుల్ గాంధీని డ్రగ్ టెస్టుకు ఒప్పించే దమ్ము ఉందా?  రాహుల్ గాంధీని ఖతం పట్టించడానికి వేరేవాళ్ళు వద్దు రేవంత్ ఒక్కడు చాలు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం వల్ల రాజకీయ పబ్బం గడుపుకోవచ్చని రేవంత్ విమర్శలు చేస్తున్నాడు. అందరికంటే ముందు రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు డ్రగ్స్ పరీక్షలు చెయ్యాలి'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చినన్ని సీట్లు కూడా రేవంత్ నాయకత్వంలో రావు. ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా రేవంత్ కు లేదు'' అన్నారు.

READ MORE  రేవంత్ డ్రగ్స్ బంధు... చర్లపల్లి జైల్లో ఆ ముఠాలతో పరిచయాలు: జీవన్ రెడ్డి సంచలనం

''వైట్ ఛాలెంజ్ అంటే కాంగ్రెస్- టీఆరెస్ ఎమ్మెల్యేలు వరుసగా నిల్చుందాం... టెస్టులు చేసుకుందాం. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు.  రేవంత్ కూడా ఈ మధ్య బక్కగా అయ్యాడు... ముందు ఆయన డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి'' అని ఎమ్మెల్యే కిశోర్ డిమాండ్ చేశారు. 

మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ...  రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ఆధారాలు లేకుండా చేసిన విమర్శలే పదే పదే చేస్తున్నారన్నారు. కేటీఆర్ విసిరిన సవాల్ పై స్పందించి రాహుల్ గాంధీని డ్రగ్స్ టెస్టుకు సిద్దం చెయ్యు రేవంత్ అని గుర్తుచేశారు. ఏ టెస్టుకైనా కేటీఆర్ సిద్ధం ముందు రాహుల్ గాంధీని రేవంత్ ఒప్పిస్తారా? అని నిలదీశారు.

''అమర వీరుల స్తూపం దగ్గరికి అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. తన భజన పరులతో రేవంత్ టీఆర్ఎస్ పై విమర్శలు చేయిస్తున్నారు. కేవలం గుర్తింపు కోసం మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఆయన యుద్ధం కాదు చేసేది ప్రజలను సాకుగా చూపి దందా చేస్తున్నారు'' అని ఆరోపించారు.

''కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం చేసే పనితీరును ప్రపంచమే అభినందిస్తోంది. రేవంత్  పగటికలలు కంటున్నారు. ఆయన తీరు మారకపోతే మా ప్రాక్టీస్ కూడా మారుతుంది'' అని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు.

click me!